SLBC టన్నెల్ పరిశీలించిన మంత్రి జూపల్లి కృష్ణారావు.
- kranthi kumar
- Mar 7
- 1 min read
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి SLBC టన్నెల్ లో ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని పరిశీలించిన మంత్రి జూపల్లి కృష్ణారావు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ, టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మంది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఇప్పటికీ ఒక అంచనాకు రాలేదని, ఈ సమస్య ఒక కొలిక్కి రావడానికి మరో రెండు, మూడు రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారని పేర్కొన్నారు. కన్వేయర్ బెల్ట్ పాడవడంతో లోపల మట్టిని బయటకు తరలించడం ఇబ్బందిగా మారిందన్నారు. రేపటిలోగా కన్వేయర్ బెల్ట్ ను రిపేర్ చేస్తే లోపల ఉన్న మట్టిని బయటకు తరలించడం సులువు అవుతుందని వెల్లడించారు. ఇలాంటి విపత్తులు జరిగినపుడు రాజకీయాలకు అతీతంగా ఏకమై సమస్యను పరిష్కరించుకోవాలని, ప్రభుత్వమైనా, ప్రతిపక్షమైనా… బాధిత కుటుంబాలపై సానుభూతి చూపించి వారిని ఆదుకోవాలన్నారు.

Comments