top of page
Search

అంతర్జాతీయ ప్రమాణాలతో గోల్ఫ్‌ కోర్స్‌ను తీర్చిదిద్దుతాం

వచ్చే ఏడాది జనవరిలో హైదరాబాద్ లొ ఇంటర్నేషనల్ గోల్ఫ్ టోర్నమెంట్:మంత్రి జూపల్లి కృష్ణారావు


అంతర్జాతీయ ప్రమాణాలతో గోల్ఫ్‌ కోర్స్‌ను తీర్చిదిద్దుతామని, వచ్చే ఏడాది జనవరి - ఫిబ్రవరి 2025 లో హైదరాబాద్ లొ ఇంటర్నేషనల్ గోల్ఫ్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గోల్కొండ లోని హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్

తెలంగాణ గోల్కొండ మాస్టర్స్‌ గోల్ఫ్‌ చాంపియన్‌ షిప్‌ ముగింపు కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజతగా నిలిచిన శంకర్ దాస్ కు ట్రోపీ, రూ. లక్షల ప్రైజ్ మనీని అందించారు.


ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ …

తెలంగాణ గోల్కొండ మాస్టర్స్‌ గోల్ఫ్‌ చాంపియన్‌ షిప్‌ ను ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ టోర్నమెంట్ గా నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని,

అంతర్జాతీయ గోల్ఫర్స్ పాల్గొంటారని అన్నారు.

ఏషియన్ ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ సర్క్యూట్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.


ఈ కార్యక్రమంలో భారతి గోల్ఫ్ సీఈఓ మనవి జైనీ,

హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ ప్రెసిడెంట్ బీవీకే రాజు, డీఎస్ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ చైర్మన్ అజయ్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.




 
 
 

Commentaires


bottom of page