top of page
Search

వనపర్తి ప్రభుత్వ కాలేజీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు

వనపర్తి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, మంత్రులు దామోదర రాజనర్సింహ గారు, జూపల్లి కృష్ణారావు గారు పర్యటించారు. ఈ సందర్భంగా వారికి స్థానిక ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు అధికారులు ఘన స్వాగతం పలికారు.

ముందుగా వనపర్తిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం వనపర్తి ప్రభుత్వ కాలేజీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.

వనపర్తి జీజీహెచ్ భవన నిర్మాణం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణం, ZPHS ( బాలుర) పాఠశాల, జూనియర్ కాలేజీ భవనాలు మరియు వనపర్తి ఐటీ టవర్, శ్రీ రంగాపురం దేవాలయం పనులు, పెబ్బేరు 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనం, రాజానగరం, పెద్దమందడి బీటీ రోడ్డు నిర్మాణ పనులు, సీసీఆర్ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు.

అనంతరం కేడిఆర్ పాలిటెక్నిక్ కాలేజీలో ప్రజాపాలన బహిరంగ సభకు నేతలు హాజరయ్యారు.

ఈ కార్యక్రమాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రణాళిక బోర్డు వైఎస్ చైర్మన్ చిన్నారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి , జిల్లా ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పార్టీ నాయకులు పాల్గొన్నారు.



 
 
 

Comments


bottom of page